Skip to main content

Posts

Showing posts from March, 2023

ఆశలే మారున

ఆశలే మారున ఆశలే మారున అనురాగాలు వీడిపోయిన ..2 చిన్న నాటి మన స్నేహము చిగురించి ఫలించుటకై కలలెన్నెన్నో కన్నవుగా కడాకు దూరమైపోతివా ..2 యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ...2 1.. అధిభూతుడైన ఆదాముతో అవ్వ కుడిచేసిన పాపం..2 మానవ జాతికే మరణము తప్పినావు ప్రభు ..2 యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ..2 2.. నీ ఎడబాటే ఆనందమా ఎడమైపోతివా నాకిక నా హృదయంబె గాయంబుగా చేసి దూరమైపోతివా ..2 జయమే స్థిరమై నాలో చీకట్లు కమ్మెనులే ..2 యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ...2 3.. లేదులే లేదులే నాలో జీవంబు ఏ మాత్రము ..2 నమ్ముకో నమ్ముకో శ్రీ యేసురాజుని నమ్ముకో ..2 ఇచ్చును ఇచ్చును అయన నీకు మోక్ష మార్గము ..2  

NEE PREMALO PRAYAANAME || Yasaswi Kondepudi || Joshua Shaik

  నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా సదా నిన్ను కొనియాడనా నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా 1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా నా త్రోవలో నీడగా 2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా నా గమ్యమే నీవయా Light of christ gospel NEE PREMALO PRAYAANAME

Neeve Chalunu Yesu || నీవే చాలును యేసు || telugu christian lyrics

  Neeve Chalunu Yesu నీవే చాలును యేసు వేరై ఉండలేను నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలేను ( 2) మనసు చెదిరిన నీ మాట నిలుచును మనుషులంతా వీడిన నీ కృపయే దాచును (2) ఈ లోక సంపద లేకున్నా మది యందు సంతసముంచావు మనుషుల సాయం రాకున్నా నిరీక్షించే ఓర్పే నేర్పావు. (2) ఆకలి వేళలో అద్భుతాలు చేసావు నాకున్న లేమిలో నన్ను దీవించావు. (2) //నీవే చాలును// గతకాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు మితి మీరే వ్యతిరేక స్థితులపై అధికారమే ఇచ్చావు. (2) కాలాలు మారిన కోర్కెలు చెదిరిన బంథాలే వీడిన నీ ప్రేమ మారదు (2).//నీవే చాలును//

Edho Aasha Naalo || Anwesshaa || Telugu Christian Songs || light of christ gospel

  Edho Aasha Naalo | Pranam Kamlakhar | Anwesshaa | Niladri |Hosanna Ministries|Telugu Christian Songs ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2" యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్య 2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య

Jeevapradatha - జీవప్రధాతవు Hosanna Ministries 2023 new Album Song-5 Pas.Ramesh

Jeevapradatha - జీవప్రధాతవు Hosanna Ministries 2023 new Album Song-5 Pas.Ramesh Jeevapradatha - జీవప్రధాతవు Hosanna Ministries 2023  Lyric జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవేప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా - నాయెడ నీకృపను జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీప్రేమను ఏమనిపాడెదనూ - ఏమని పొగడెదను శుభకరమైన తొలిప్రేమనునే - మరువకజీవింప కృపనీయ్యవా కోవెలలోనికానుకనేనై - కోరికలోని వేడుక నీవై జతకలిసినిలిచి - జీవింపదలచి కార్చితివి నీరుధిరమే నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా నేనేమైయున్న నీకృపకాదా - నాతోనీసన్నిధిని పంపవా ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యాకాంతులు నిదురించినను తొలివెలుగు నీవై - ఉదయించినాపై నడిపించినది నీవయ్యా నీకృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా మహిమనుధరించిన యోధులతోకలసి - దిగివచ్చెదవు నాకోసమే వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు విజయోత్సవముతో - ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుమునాయేసయ్యా For More Updates Follow us Un Social Media https://www.youtube.com/@LightOfChrist...

Soundarya Seeyonulo - సౌందర్య సీయోనులో || Album Song-3 Pas.ABRAHAM

  Soundarya Seeyonulo - సౌందర్య సీయోనులో || Album Song-3 Pas.ABRAHAM సౌందర్య సీయోనులో Lyrics బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై హృదయాన కొలువాయెనే ననుజీవింపజేసే నీవాక్యమే నాకిలలోన సంతోషమే 1. పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు నాలోనిరీక్షణ - నీలోసంరక్షణ నీకే నాహృదయార్పణ 2.ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక 3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు - చల్లని నీచూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే

Adviteeyuda - అద్వితీయుడా || Hosanna Ministries 2023

  Adviteeyuda - అద్వితీయుడా || Hosanna Ministries 2023  lyrics మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం ప్రతిఫలింప జేయునే ఎన్నడూ కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము వర్ణించలేనుస్వామీ - నీ గొప్పకార్యాలను నీ సాటి లేరు ఇలలో - అద్వితీయుడా ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై - నడిపించుచున్ననేర్పరీ అలుపెరుగనిపోరాటాలే - ఊహించని ఉప్పెనలై ననునిలువనీయ్యని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై తడికన్నులనే తుడిచిననేస్తం - ఇలలోనీవే కదా! యేసయ్యా నిరంతరం నీసన్నిధిలో - నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనే నీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి నీఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు - ఆ గడియవరకు విడువకూ నేవేచియున్నాను నీరాక కోసమే శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా For more updates follow us Light Of Christ Gospel on You...